Asifabad | పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు విధిగా తీసుకోవాలని సిఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు.
ఉద్యమ కెరటం, అసిఫాబాద్ టౌన్ : పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు విధిగా తీసుకోవాలని సిఐ బాలాజీ వరప్రసాద్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సంఘం నాయకులతో కలసి మట్టి వినాయకుల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం ద్వారా కొంత మేరకు పర్యావరనాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడటం ద్వారా నీటి కాలుష్యం ఏర్పడి పశువులకు హాని జరుగుతుందనీ అన్నారు. మున్నూరు కాపు సంఘం ద్వారా మట్టి వినాయకుల ను పంపిణీ చేయడం చాలా అభిందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉదయ్ కిరణ్, మున్నూరు కాపు సంఘం నాయకులు వెంకన్న,గణపతి, సురేష్, సదాశివ్, ప్రహ్లాద్, జక్కయ్య, పెంటయ్య, శంకర్, గోపాల్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.