School Holiday | ఈ నెల 7వ తేదీన విద్యాసంస్థలకు సెలవు

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : కొమురం భీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు (పాఠశాలలు, కళాశాలలు) సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ ప్రాంతంలో కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 7వ తేదీన ప్రకటించిన సెలవుకు బదులుగా నవంబర్ 8వ తేదీ రెండవ శనివారం రోజున పని దినముగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.