కాగజ్ నగర్ డిఎస్పీకి పదోన్నతి

ఎస్పీగా పదోన్నతి పొందిన బి రామానుజం
ఉద్యమ కెరటం, సిర్పూర్ టీ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ డిఎస్పీగా పనిచేసిన బి.రామానుజం అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. సోమవారం ఈ సందర్భంగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఎస్పీ ఆయనకు సింహతలాటం బ్యాడ్జిని తొడిగి, శుభాకాంక్షలు తెలిపారు. అదనపు ఎస్పీ రామానుజం పదోన్నతి పై డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయవలసిందిగా, డిజిపి కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.