Asifabad | నిబంధనలు పాటించని ఆస్పత్రుల పై చర్యలు ఏవి..!

వైద్యం పేరుతో అమాయక ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్న ఆస్పత్రుల పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ , కెవిపిఎస్ ఆధ్వర్యంలో వినతి

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ టౌన్  : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వా నియమ నిబంధనలు పాటించకుండా వైద్యం పేరుతో అమాయక ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని  డివైఎఫ్ఐ  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గోడిసెల కార్తీక్ , కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ ఆరోపించారు. గురువారం జిల్లా వైద్యాధికారి  కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి సీతారాం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని ఆసుపత్రిలలో ప్రదర్శించి ధరల పట్టిక లో ఒక ధర ఉంటే,  సిబ్బంది అధికంగా వసూలు చేస్తున్నరన్నారు . సూచనల బోర్డు మీద ఒక డాక్టర్ పేరు ఉంటే వైద్యం ఇంకొక డాక్టర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆసిఫాబాద్ , కాగజ్నగర్ పట్టణాలలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రిలను నిర్వహిస్తున్నారని , జిల్లా ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అలాంటి ఆసుపత్రిలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు .