సిర్పూర్ టి జెడ్పిటిసి గా పోటీ చేస్తా 

మోసపూరిత పార్టీలకు, నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి బుద్ధి చెప్పాలని, ప్రజలు స్థానికంగా ఉండే విద్యావంతులకు అవకాశం కల్పించాలని యువ న్యాయవాది కే కిషోర్ తెలిపారు.

ఉద్యమ కెరటం, సిర్పూర్ టీ : సిర్పూర్ టి జడ్పిటిసి గా పోటీ చేస్తానని యువ న్యాయవాది కే కిషోర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్థానిక పేద వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు తోడ్పడుతానని తెలిపారు. సిర్పూర్ టి నియోజకవర్గం లోని సమస్యలు క్షేత్రస్థాయిలో తనకు తెలుసు అని , సిర్పూర్ టి ప్రజలు అవకాశం ఇస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉంటానన్నారు. 2018లో సిర్పూర్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో అంబేద్కర్ రైట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పోటీ చేశానని తెలిపారు. తనకు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. సిర్పూర్ టి మండలలోని మారుమూల గ్రామాలు ఇప్పటికీ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న పాలకులు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు పూర్తి కృషి చేస్తానని తెలిపారు. మోసపూరిత పార్టీలకు, నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి బుద్ధి చెప్పాలని తెలిపారు. ప్రజలు స్థానికంగా ఉండే విద్యావంతులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా సేవ చేస్తానన్నారు. జాతీయస్థాయి పార్టీ తరపున సిర్పూర్ టి జడ్పిటిసిగా పోటీ చేస్తానని తెలిపారు.