ఆసిఫాబాద్ పెట్రోల్ పంపు లో అగ్ని ప్రమాదం..!

తప్పిన పెను ప్రమాదం..
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న పెట్రోల్ పంపు లో ప్రమాదవసత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం..
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న పెట్రోల్ పంపు లో శుక్రవారం సాయంత్రం ప్రమాదవసత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి హుటాహుటిన పోలీసులు , అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పేను ప్రమాదం తప్పింది.