Sircilla Dist Helicopters Army Rescue | చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు

సహాయక చర్యల ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ
ఉద్యమ కెరటం, గంభీరావుపేట : గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు కాపరులు అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు. (Sircilla Dist Helicopters Army Rescue ) హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు గురువారం మధ్యాహ్నం 12:40 చేరుకొని రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్,పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి,బిసే ప్రదీప్,బిసే ఛాయా లను క్షేమంగా గమ్యం చేర్చారు. ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికార యంత్రాంగం దగ్గరుండి పర్యవేక్షించారు.