రేపు జిల్లాలో పాఠశాలలకు సెలవు
.jpg)
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నెల 28 వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365 ఏర్పాటు చేయడం జరిగిందని, తక్షణ సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలోని లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.