సెయింట్ జోయల్స్ స్కూల్క్ కు ఎక్సలెన్స్ 2025- 26 అవార్డు
కరస్పాండెంట్ పరదేశి దేవాబుషణం కు దక్కిన అరుదైన గౌరవం
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలో 1999వ వ సంవత్సరంలో సెయింట్ జోయల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థాపించి ఎందరో విద్యార్థులకు విద్యాబోధన చేసి విద్యార్థుల ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్న కరస్పాండెంట్ పరదేశి దేవాబుషణం కు అరుదైన అవార్డు దక్కింది. నాణ్యమైన విద్యా బోధన తో పాటు విద్యార్థుల సామర్థ్యం పెంపుదల విశిష్టమైన విద్య సేవలు. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రస్థాయిలో ఈ అవార్డులు అందిస్తుండగా సెయింట్ జోయల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ ఈ అవార్డు ఎంపికైనారు.రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ అవార్డు అందుకున్నారు. గత మూడు దశబ్దాలకు పైగా విద్యభివృద్ధికి పాటుపడ్తుండగా ఈ ఏడాది వరుసగా రెండు అవార్డు లు దక్కడం అనందంగా ఉందని . అవార్డు మరింత బాధ్యత పెంచిందాన్నారు. హైద్రాబాద్ లోని హైటెక్స్ సీటీ లో నిర్వహించిన ఈ అవార్డు పంపిణీ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావ్ డాక్టర్ పరంజ్యోతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి కిషన్ రావ్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నరు
