సమిష్టి కృషితో సిరికొండ గ్రామన్ని అభివృద్ధి పథంలో నడుపుదాం

బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

ఉద్యమ కెరటం నేరడిగొండ : అందరం కలసి సమిష్టి కృషితో సిరికొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ (Ade Gajender) అన్నారు.ఇటీవల నూతనంగా ఎన్నుకోబడ్డ సిరికొండ గ్రామ సర్పంచ్ దత్తు, ఉప సర్పంచ్ తోకల రాజు లను ఆదివారం మండలకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు వార్డు సభ్యులను గ్రామ పెద్దలను  అభినందించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,ఎలాంటి చిన్న సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అందరం కలసి సిరికొండ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఇమామ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్,బియ్యల రాజేశ్, సురేష్, యాదవ రావు,లస్మన్న, ఎల్లయ్య, లక్ష్మణ్,రంజాన్, ఇమామ్,సందీప్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.