నిరంతర ప్రజా సేవకుడు జుబేర్

పోచారం కుటుంబమే ఆయనకు అండ..
పదవులు ఆశించకుండా గత 12 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న మైనార్టీ నాయకుడు.....ఎంపీటీసీ గా పోటీ చేస్తే గెలుపు పక్క అంటున్న అభిమానులు
ఉద్యమ కెరటం , నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన జుబేర్ గత 12 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం ఆయన మూడు ఎన్నికల్లో కష్టపడ్డారు. ఇప్పటిదాకా ఎటువంటి పదవులకు ఆశించకుండా ప్రజాసేవ తన లక్ష్యంగా భావించి మైనార్టీలను కోటగిరి మండలంలో ముందంజలో తీసుకెళ్లడంలో జుబేర్ పాత్ర ఎంతైనా ఉందని స్థానిక మైనార్టీలు చెబుతారు. జడ్పిటిసి ఎంపీపీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో జుబేర్ కోటిగిరి మండలంలో ఎంపీటీసీగా పోటీ చేస్తే గెలవడం ఖాయమని తన మౌనవ స్వభావంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి వాడిలా కోటగిరి మండల కేంద్రంలో తనదైన శైలితో జుబేర్ పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కోటిగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్న జుబేర్ ను బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ఎంపీటీసీ టికెట్ కేటాయించాలని కోటగిరి మండల ప్రజలు కోరుతున్నారు.