అందరివాడు "షేక్ సందాని"

20 ఏళ్ల రాజకీయాల్లో ఉంటూ ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న షేక్ సందాని.. సర్పంచ్ గా బరిలో మైనారిటీ నాయకుడు....

ఉద్యమ కెరటం , నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలం పోతంగల్ (Pothangal) మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామం. పోతంగల్ ప్రేమ ఆప్యాయత అక్కడి ప్రజల నైజం. పోతంగల్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సేవ చేస్తూ వస్తున్న వ్యక్తి షేక్ సందాని (Shaik Samdani). గడిచిన ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో  గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. పోతంగల్ గ్రామంలో 6 వేలకు పైగా ఓటర్లు  ఉన్నారు. అయితే అందులో 2వేల కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో తనదైన శైలితో సంధాని పేరు సంపాదించుకున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున  పోటీ చేస్తే ఆయన గెలుపు ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టిడిపి,బిఆర్ఎస్ పార్టీల నుంచి సేవ చేస్తూ వస్తున్న సంధాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గ నాయకులు షేక్ సందాని కి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.