భీం తాతా నువ్వు మళ్లీ పుట్టాలి.. 

ఆదివాసీల పోరాట వీరుడు కొమరం భీం... జల్ , జంగల్ , జమీన్ కోసం ఆరాటం... నేటికీ నెరవేరని యోధుడి ఆశయం...

భీం తాతా నువ్వు మళ్లీ పుట్టాలి

ఆదివాసీల పోరాట వీరుడు కొమరం భీం

జల్ , జంగల్ , జమీన్ కోసం ఆరాటం

నేటికీ నెరవేరని యోధుడి ఆశయం 

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : జల్...జంగల్... జమీన్.... నినాదంతో భూమి , నీరు, అడవి కోసం అప్పటి నైజాం ప్రభుత్వంలోని మిలటరీతో సాయుధ పోరాటాలు చేసి అసువులు బాసాడు ఆదివాసుల ముద్దుబిడ్డ కొమురం భీం. ఆయన పోరాటం చేసి 85 ఏళ్లు గడుస్తున్నా. అతడీ ఆశయం మాత్రం నెరవేరలేదు. నేటికీ తాగునీరు, సాగునీరు, సరియైన రోడ్లు , పాఠశాల లేని పల్లెలు కోకోల్లలు .. ' అందుకే.. భీం తాతా నువ్వు మళ్లీ పుట్టాలి 'అంటున్నారు అమాయక ఆదివాసుల వారసులు. నేడు జోడేఘాట్ లో కొమరం భీం 85 వ వర్ధంతి నిర్వహిస్తున్న సందర్భంగా "ఉద్యమ కెరటం" ప్రత్యేక కథనం.

పట్టని ఆదివాసుల హక్కులు..

ఎన్నో ప్రభుత్వాలు మారిన నాటి నుంచి నేటి వరకు ఆదివాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. దయానియా పరిస్థితిలో జీవితాలు గడుపుతున్నారు. నీరు, భూమి, అడవి పై ఇంకా వీరికి స్వాతంత్రం రాలేదు. గిరిజనుల కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు.