రైతుకు కండిషన్లా..!

రైతులకు కన్నీరు పెట్టడం ఏమిటి..?

రైతులకు యూరియా కోసం కండిషన్లు ఏమిటి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి మండిపడ్డారు.

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నం పెట్టే  అన్నదాతలు అల్లాడుతుంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే రైతుల పట్ల ఎంత జాలి దయా  ఉన్నాయో అర్థం అవుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యూరియా సమస్య పరిష్కరించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అసలు ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సహకార సంఘం కార్యాలయాల చుట్టూ రైతులు వ్యవసాయ పనులు వదిలిపెట్టి యూరియా కోసం తిరగడం ఏంటిదని ఎంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ ఉండదన్నారు. వెంటనే ప్రభుత్వం రైతుల కు యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిరే ప్రకాష్, తాళ్లపల్లి దివాకర్ లు పాల్గొన్నారు.