చెయ్యి తడిపితే తప్ప పని కాదు..!

ఖమాన పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణలు 

పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కు గ్రామస్తుల వినతి , గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా

ఉద్యమ కెరటం, వాంకిడి : ప్రజలకు ఏ రకమైన అనుమతులు ఇవ్వాలన్న చెయ్యి తడిపితే తప్ప పని అవ్వడం లేదు. వారి అవకాశాన్ని ఆసరా చేసుకుని సొమ్ము లూటీ చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖమాన గ్రామపంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణాలు చేస్తూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎంపీడీవో జావిద్ , ఏపీ శ్రావణ్ కుమార్ విచారణ కోసం ఖమాన గ్రామపంచాయతీకి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యదర్శి పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కు వినతి పత్రం అందజేశారు. అంతకముందు పంచాయతీ కార్యదర్శి పై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.