మాడిఫైడ్ సైలెన్సర్ బిగిస్తే వాహనం సీజ్

50  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు - ఆసిఫాబాద్ ఎఎస్పి చిత్తరంజన్ 

ఉద్యమ కెరటం, వాంకిడి : ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు ఆసిఫాబాద్ ఎఎస్పి ఆచిత్తరంజన్ హెచ్చరించారు.  శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే  సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 50 వాహనాల సైలెన్సెర్స్ లను వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పి చిత్తరంజన్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా ఎఎస్పి  మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి ఆసిఫాబాద్ డివిజన్ వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు. మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తాం అని, డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు అని అన్నారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్‌ను కొనసాగిస్తూనే ఉంటామన్నారు . ఇలాంటి చర్యల వల్ల శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని  తెలిపారు.  ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అధిక శబ్దాలు గల డీజే లకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత ధ్వని కాలుష్యం ఏర్పరిచే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  సీఐలు బాలాజీ వర ప్రసాద్,  సత్యనారాయణ,  రమేష్,  సంజయ్, కేరమేరి ఎస్.ఐ మధుకర్,  ఎస్సై లు చంద్రశేఖర్ , ఉదయ్ కిరణ్ ,సిబ్బంది పాల్గొన్నారు.