ప్రవక్త ముహమ్మద్ చూపించిన సన్మార్గంలో నడవాలి

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
క్విజ్ పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ టౌన్ : ప్రవక్త ముహమ్మద్ బోధనలైన శాంతి, సహనం, సామరస్యాన్ని గురించి చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలో మీలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా మహ్మదియా రజా దిని మదర్సా హెడ్ మాస్టర్ షబానా బేగం ఆధ్వర్యంలో క్విజ్ పోటీలో గెలిచిన విద్యార్థులకు ఎ రోజ్ గార్డెన్ లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Lakshmi ) బహుమతులు అందజేశారు. అనంతరం స్కూల్ సిబ్బంది ఎమ్మెల్యే గారికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం S A W )ఆయన సత్యం, శాంతి, దయ, సమానత్వం కోసం ఎంత కృషి చేశారని తెలిపారు. మన దేశంలో అనేక మతాలు, సంస్కృతులు కలిసి జీవిస్తున్నామని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే కోరారు. విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి వాటిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని, ముస్లిం సమాజం అభివృద్ధిలో భాగం కావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారు.