ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్యే

జీ ఓ 49 రద్దు చేసేంతవరకు దీక్ష కొనసాగిస్తా :ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

పోడు భూముల రైతుల సమస్య పూర్తి స్థాయిగా పరిష్కరించాలి   సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

ఉద్యమ కెరటం, న్యూస్ :  జీ ఓ 49 పూర్తి స్థాయిగా రద్దు చేసి , పోడు భూముల రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేంత వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు. సోమవారం తన నివాసంలో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను ఇంకా వెనక్కి నెట్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జీ ఓ 49 తీసుకువచ్చిందని ఆరోపించారు. జిల్లాలో గిరిజన గ్రామాలలో రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అభివృద్ధికి అమడ దూరంలో గిరిజనులు ఉంటుంటే జీ ఓ తెచ్చి అభివృద్ధికి అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. అటవీ ప్రాంతంలో ములుగులో సీతక్క కు రోడ్లకు అనుమతి ఇస్తారు కానీ కొమురం భీం జిల్లాలు మాత్రం అదే అటవీ ప్రాంతంలో ఎందుకు అనుమతి ఇవ్వరని ఇంత వివక్షత ఎందుకు అంటూ మండిపడ్డారు. అక్కడ ఒక న్యాయం ఇక్కడొక న్యాయం ఏమిటి అని ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారుల దాస్టికం జిల్లాలో విపరీతంగా పెరిగిపోతుందని మండిపడ్డారు. అటవీ శాఖ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వతస్సు పలుకుతూ పోడు భూముల రైతులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దింద గ్రామ పోడు భూముల రైతులకు కర్జల్లి రేంజ్ కార్యాలయానికి పిలిపించి బెదిరించడం పై తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అటవీశాఖ అధికారుల జులం విపరీతంగా పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దింద, కడంబా, ఆడేపల్లి, డబ్బా గ్రామాలతో పాటు మరెన్నో గ్రామాలలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా మూడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, జీ ఓ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయబద్ధంగా అటవీ శాఖ అధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపేందుకు పిలుపునిస్తే తనను హౌస్ అరెస్టు చేసి, బిజెపి పార్టీ నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. న్యాయబద్ధంగా నిరసన తెలిపే హక్కు కాలరాయడం ఏమిటి అని మండిపడ్డారు. జీ ఓ 49 రద్దు చేసి, పోడు భూముల రైతుల పూర్తిస్థాయి సమస్య పరిష్కరించేంతవరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అటవీ శాఖ కార్యాలయం ముట్టడి పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందస్తుగా సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. బిజెపి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.