Mancherial | ఎల్లప్పుడూ సామాజిక సేవలో అంజనీ పుత్ర సంస్థ ముందుంటుంది

ఎల్లప్పుడూ సామాజిక సేవలో అంజనీ పుత్ర సంస్థ  ముందుంటుందని అంజనీ పుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి అన్నారు

 ఉద్యమ కెరటం, మంచిర్యాల: ఎల్లప్పుడూ సామాజిక సేవలో అంజనీ పుత్ర సంస్థ ( Anjani putra ) ముందుంటుందని అంజనీ పుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి అన్నారు. గురువారం మంచిర్యాలలో  అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో  వినాయక నవరాత్రోత్సవాల్లో మొదటి రోజున 2 వేల మందికి  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్న దానం గొప్పదని.  గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా  అన్నదానం తప్పనిసరయింది జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే  అన్నదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లుసూరినేనీ కిషన్, కాసర్ల సదాందం, డైరెక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.