పోడు రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు : ఎమ్మెల్సీ

ప్రతిపక్షాల  ఉచ్చులో పడి పోడు రైతులు కేసుల పాలు  కావద్దు :ఎమ్మెల్సీ దండే విఠల్

ఉద్యమ కెరటం, న్యూస్ : కౌటాల మండల కాంగ్రెస్  పార్టీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఉచ్చులో పోడు రైతులు పడి కేసుల పాలు  కావద్దని  ఆయన  సూచించారు . కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టంలో పొడు సాగు చేస్తున్న గిరిజనులకు మాత్రమే చట్టబద్ధత కల్పించాలని ఉందని , గిరిజనేతర రైతులకు  హక్కులు కల్పించడానికి వీలులేదని చట్టం చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే  పాల్వాయి హరీష్ బాబు రైతులను రెచ్చగొట్టి పాదయాత్రలు , అటవీశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ పర్యటన కు వచ్చిన మంత్రులతో   దిందా గ్రామ రైతుల సమస్యను వారికి వివరించి గిరిజనేతర రైతులకు 5 ఎకరాల లోపు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఇవ్వడానికి అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూములు కలిగి ఉన్నారని అధికారులు జాబితాలు రూపొందించడం జరిగిందని అన్నారు.  ప్రతి ఒక్క గిరిజనేత రైతుకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఎమ్మెల్యే హరీష్ బాబు కర్జలి రేంజ్ పరిధిలో టేకు చెట్లను నరుకుతున్నారని మాట్లాడడం జరిగిందని దీనివల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందన్నారు. ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ అభ్యర్థి  నగేష్ ను గెలిపిస్తే జోడెద్దుల్లాగా పనిచేసి గిరిజనేతర రైతులకు పొడు పట్టాల పంపిణీ చట్టం తీసుకు వస్తామన్న హామీ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు . ప్రజలకు మోసగించడంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాయని వాటిని నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ జిల్లా చైర్మన్ గణపతి ,మండల అధ్యక్షులు గంగారం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.