Neradigonda | వ్యాధులు ప్రభలకుండ తగు చర్యలు చెపట్టాలి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండ తగు చర్యలు చెపట్టాలని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్. టి మనోహర్ అన్నారు.

ఉద్యమ కెరటం , నేరడిగొండ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండ తగు చర్యలు చెపట్టాలని అడిషనల్ డిఎంహెచ్ఓ (Deputy DM&HO) డాక్టర్. టి మనోహర్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఓపి రిజస్టర్, ప్రసవ గదిని పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు,వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుకునేలా అవగాహన కలించాలని సూచించారు. అదేవిదంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు,వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆయన వెంట హెచ్ఇఓ పవర్ రవీందర్,మెహన్ బాపూజీ, వాణి ఉత్తమ్ సింగ్, సాయన్న, నర్సయ్య, తదితరులు ఉన్నారు.