ఈ మంత్రికి ఎంత ధైర్యం!

ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం
– సిగ్నల్స్, భద్రతా లేని సమస్యాత్మక ప్రాంతం – అధికారులు వారించినా గిరిజన విద్యార్థులతో కలిసి రాత్రి వసతి గృహంలో బస – ఇలా ఓ మంత్రి చేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటి సారి – మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు బస పై గిరిజనుల్లో ఆనందం
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ ప్రతినిధి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామం.. ఎటు చూసినా దట్టమైన అరణ్యం.. సమస్యాత్మక ప్రాంతం.. సరైన రవాణా ఉండదు. సెల్ఫోన్సిగ్నల్రాదు.. ఈ ప్రాంతానికి రావడానికి అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ వెనుకడుగే వేస్తారు.. అలాంటి ప్రాంతంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు మంగళవారం రాత్రి బస చేసేందుకు సిద్ధమయ్యారు. వసతి గృహం విద్యార్థులతో కలిసి నిద్ర చేసేందుకు ప్లాన్వేశారు. సర్.. సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది.. వద్దని అధికారులు వారించారు. అయినా, మంత్రి వెనుకడుగు వేయలేదు. ఈ రాత్రి పిల్లలతో కలిసి బస చేస్తానని నిర్ణయించుకున్నారు. ఆ మేరకే మంగళవారం రాత్రి నుంచి ఉదయం వరకు మార్లవాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహంలో గడిపారు. పిల్లలతో ముచ్చటించారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఉదయం మంత్రి వసతి గృహం నుంచి వెళ్లిపోయారు. కాగా, ఓ వైపు మంత్రి రాత్రి బస చేయగా, అధికారయంత్రం కంటిపై కునుకు లేకుండా పోయింది. అయితే, ఓ మంత్రి ఇలా బస చేయడం.. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా చరిత్రలో మొదటి సారి కాగా, మంత్రి నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఓ మంత్రి నిద్ర చేయడం సాహసోపేత నిర్ణయమేనని చెప్పుకుంటున్నారు.