బాన్సువాడ లో కాంగ్రెస్, బీజేపి మధ్యే పోటీ.....

ప్రతిపక్ష పార్టీగా పుంజుకుంటున్న బీజేపి

ఉద్యమ కెరటం, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 9 నుంచి జడ్పిటిసి ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే బాన్సువాడ నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలలో బారసా పార్టీ జెండా బాన్సువాడ నియోజకవర్గంలో రెపరెపలాడింది, అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో బరాస పార్టీలో ఉన్న నాయకులు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.నియోజకవర్గంలో బరసా పార్టీ బలాన్ని పుంజుకునేందుకు కల్వకుంట్ల కవిత  ప్రయత్నాలు చేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బరాస పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం జరిగింది. నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో కొందరు ఇంకా బారసా పార్టీలోనే కొనసాగుతున్నారు. కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అధికార పార్టీల వైపే ప్రజలు ఓట్లు  వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్,బిజెపి పార్టీ టికెట్ల కోసం స్థానిక నాయకులు  కష్టపడుతున్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో బీజేపి పార్టీని తక్కువ అంచనా వేయరాదని యువత  బీజేపీ వైపు ఎక్కువ మోతాదులో వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ మేధావులు చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశాలు ఉన్నాయి. నాయకులు కూడా ఈ రెండు పార్టీల టికెట్ల కోసమే రికమండేషన్లు మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ బిజెపి మధ్య గట్టి పోటీ ఉంటుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.