ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన ఐటీడీఏ పీఓ

ఆకస్మిక తనిఖీ చేసిన ఐటీడీఏ పిఓ
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఐటిడిఎ పిఓ ఖుష్బు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఉద్యమ కెరటం, అసిఫాబాద్ : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఐటిడిఎ పిఓ ఖుష్బు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పి టి జి గిరిజన ఆశ్రమ జూనియర్ కళాశాల బాలురు (గురుకులం) ను పిఓ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఏమైనా సమస్య ఉందా అని అడగగా తెలుగు టెక్స్ట్ బుక్స్ లు రాలేదని విద్యార్థులు చెప్పడంతో త్వరలోనే అందే విధంగా చూస్తామని తెలిపారు. అదేవిధంగా సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు డి వెంకటేశ్వర్లు కు తన పిరియడ్ సమయానికి ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నందున షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే ప్రిన్సిపల్ రూంలో స్కూల్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేసే విధంగా ఉండాలని ప్రిన్సిపల్ కు వార్డెన్ కు ఆదేశించారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలన్నారు సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలనీ అన్నారు. ప్రతిరోజు వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు.