మంత్రి ఆదేశించినా పట్టించుకోని అధికారులు..

ఇబ్బంది పడ్డ దివ్యాంగుడు 

ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ రూరల్: ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామ సమీపంలోని  కల్వర్టు పై బుధవారం కురిసిన వర్షానికి  వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రానికి వెళ్ళిన ఓ వికలాంగుడు కల్వర్టు దాటడానికి ఇబ్బందులు పడ్డాడు దీంతో గ్రామానికి చెందిన యువకులు అతన్ని ఎత్తుకొని కల్వర్టు దాటించారు. కాగ ఈ కల్వర్టును ఈనెల 20వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించి,  కల్వర్టు పైనుండి నీరు వెళ్లకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఎలాంటి అంతరం లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కానీ జిల్లా ఇన్చార్జి  మంత్రి ఆదేశాలు అధికారుల పాటించడం లేదు. ఇప్పటివరకు మరమ్మత్తులు కాకపోవడంతో గ్రామస్తులు కల్వర్టుపై నుండి వాహనాలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.