KTR | సిరిసిల్ల , కామారెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్

ప్రజలకు భరోసా ఇచ్చిన కేటీఆర్

సిరిసిల్ల , కామారెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్, ప్రజలకు పలకరిస్తూ భరోసా ఇచ్చిన కేటీఆర్. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు.

ఉద్యమ కెరటం, సిరిసిల్ల /కామారెడ్డి : సిరిసిల్లలో వరద ప్రాంతాలను గురువారం  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , స్థానిక ఎమ్మెల్లే కేటీఆర్ పరిశీలించారు.గంభీరావు పేట మండలం నర్మాల ఎగువ మానేరు వాగు లో చిక్కు కున్న రైతులను పలకరించారు. అనంతరం కేటీఆర్ మీడియతో మాట్లాడుతూ వరద ప్రవాహం వల్ల నష్ట పోయిన పంట పొలాలకు ఎకరానికి 25000/- చొప్పున రైతులకు నష్ట పరిహారం ,  భారీ వర్షాల వల్ల కూలి పోయిన  ఇండ్ల వారికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలన్నారు. వరదల్లో ప్రాణాలు పోయిన వారి కుటుంబానికి 25 లక్షల సహాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదల్లో చిక్కుకున్న రైతులకు సహాయం కొరకు రెండు రోజుల నుంచి జిల్లా అధికారులు మండల ప్రభుత్వ అధికారుల పని తీరు బాగుందని వారిని అభినందించారు.  అనంతరం
కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు.  పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాల పై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ గారి తో, స్థానిక నాయకులతో ఫోన్లో మాట్లాడి వరద బాధితులకు అండగా ఉండాలని సూచించారు.