Komrambheem | రాష్ట్ర స్థాయి పండుగగా కొమురం భీమ్ వర్ధంతి గుర్తింపు

రాష్ట్ర స్థాయి పండుగగా కొమురం భీమ్ వర్ధంతి గుర్తింపు పై హర్షం
ఉద్యమ కెరటం, డెస్క్: ఆదివాసుల ఆరాధ్య దైవమైన కొమురం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో గిరిజన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ ఆశ్వయుజ పౌర్ణమి రోజున అధికారికంగా జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ ప్రాంతంలో కొమురం భీం వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది.కొమురం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం పట్ల ఆదివాసి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.