జిల్లాలో వంతెనలు నిర్మించాలని వినతి

అకాల వర్షాల కారణంగా  పంట నష్టం  జరిగిన రైతులకు, నష్టపరిహారం అందించాలి

జిల్లాలో రోడ్డు రవాణా వంతెనలు నిర్మించాలని ,అకాల వర్షాల కారణంగా  పంట నష్టం  జరిగిన రైతులకు, నష్టపరిహారం అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కీ వినతి పత్రం సమర్పించారు.

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ టౌన్ :  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా  రోడ్లు వంతెన సౌకర్యాలు లేక మారుమూల ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షాల కారణం  ఓర్రెలు, వాగులు ఉప్పొంగి పోవడంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో  గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం రావాలంటే ఇబ్బంది పడాల్సిందేనని, అట్లా జిల్లాలో రోడ్లు సరిగ్గా లేవని , వంతెనలు లేవు వీటి కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రోడ్లు వంతెనలు నిర్మించాలని, అదేవిధంగా జిల్లాలో అకాల వర్షాల కారణము వలన రైతులకు పంట నష్టం జరిగిందని, వర్షాలకు నష్టపోయిన పంటకు ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న ,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ , ముంజం ఆనంద్ కుమార్,  గొడిసెల కార్తీక్,  గేడం టీకానంద్  తదితరులు పాల్గొన్నారు.