కాగజ్ నగర్ తహసిల్దార్ కు షోకాజ్ నోటీస్..!

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో సక్రమంగా స్పందించలేదని  కాగజ్ నగర్ తహసిల్దార్ మధుకర్ కు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల షోకాజ్ నోటీస్ జారీ చేశారు

 

ఉద్యమ కెరటం, కాగజ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో సక్రమంగా స్పందించలేదని  కాగజ్ నగర్ తహసిల్దార్ మధుకర్ కు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల షోకాజ్ నోటీస్ జారీ చేశారు. భూ భారతి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ భూభారతి కార్యక్రమానికి సంబంధించిన ఫైళ్ళు నిర్దేశించిన కాలక్రమంలో సమర్పించడంలో తహసిల్దార్ విఫలమైనట్లు దృష్టికి వచ్చినట్లు , జారీచేసిన షోకాజ్ నోటీస్  మూడు రోజులలో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ సిఫారసు చేయనున్నట్లు షోకాజ్ నోటీసులో సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.